Ayushman Bharat: రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్..

Ayushman Bharat: ఆరోగ్య సేవలను పేదలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ పేరుతో అమలవుతున్న ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం అందిస్తున్నారు. ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండా చికిత్స పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఒక పెద్ద భరోసాగా మారింది. గత కొన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకం పరిధి...