Money Management: జీతం డబ్బులు త్వరగా అయిపోతున్నాయా..?

Money Management: నెల ప్రారంభంలో జీతం ఖాతాలో పడినప్పుడు ఆర్థికంగా కొంత భరోసా కలిగినట్లే అనిపిస్తుంది. కానీ చాలా మంది ఉద్యోగుల పరిస్థితి చూస్తే జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, రుణాల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు వంటి అనేక బాధ్యతలతో జీతంలో పెద్ద భాగం ఖర్చైపోతుంది. ఫలితంగా నెలాఖరు వరకు డబ్బులు సరిపోక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అత్యవసర అవసరాలు ఎదురైతే అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆదాయం తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం...