Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్
Telangana: తెలంగాణలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే అంశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచన విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలు, బాలికల విద్యపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాల్సిన సమయంలో...