Politics: మళ్లీ ప్రజల్లోకి బీఆర్ఎస్.. కేసీఆర్ బస్సుయాత్ర, కేటీఆర్ పాదయాత్రకు రంగం సిద్ధం?
Politics: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా మమేకం కావడానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన అనంతరం బీఆర్ఎస్ తన దృష్టిని సంస్థాగత పునర్నిర్మాణంపై కేంద్రీకరించింది. సభ్యత్వ...