Finance: గృహ రుణాలపై వడ్డీ రేట్లు స్థిరం.. ఏ బ్యాంకులో లోన్ చౌకగా లభిస్తుందంటే?
Finance: సొంత ఇల్లు ప్రతి కుటుంబం కల. అయితే రోజురోజుకూ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల కారణంగా ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించి ఇల్లు కొనుగోలు చేయడం చాలా మందికి సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో గృహ రుణాలు మధ్యతరగతి కుటుంబాలకు ప్రధాన ఆధారంగా మారాయి. తాజాగా ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. దేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం స్థిరంగా కొనసాగే అవకాశం ఏర్పడింది....