Adilabad: తెలంగాణ ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతుందా?.. ఆదిలాబాద్‌కు వాయుసేన శిక్షణ కేంద్రం?

Adilabad: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా త్వరలోనే భారత వాయుసేన శిక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన హకీంపేట, దుండిగల్ కేంద్రాల్లో కొనసాగుతున్న భారత వాయుసేన పైలట్ శిక్షణ కార్యక్రమాలకు అనుబంధంగా ఆదిలాబాద్‌లో కొత్త శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే దేశ రక్షణ రంగంలో ఆదిలాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందే జిల్లాల జాబితాలో చేరనుంది. ప్రస్తుతం భారత వాయుసేన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నడిపే పైలట్లకు హకీంపేట, దుండిగల్ ప్రాంతాల్లో శిక్షణ అందిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో విమాన రాకపోకలు గణనీయంగా పెరగడంతో శిక్షణ కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది....