Women’s T20 World Cup 2026: అప్పుడే అన్ని లక్షల టిక్కెట్లు ఖతం!
Women’s T20 World Cup 2026: మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్కప్ 2026 టికెట్ విక్రయాలే నిదర్శనంగా నిలిచాయి. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి ఇప్పటికే దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడవడం చరిత్రాత్మక ఘట్టంగా మారింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నీ ప్రారంభానికి ముందే ఇంత భారీ స్థాయిలో టికెట్లు విక్రయమైన సందర్భం ఇదే తొలిసారి కావడం విశేషం. టోర్నీ ప్రారంభానికి ముందే అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహం మహిళల క్రికెట్ భవిష్యత్తుకు మరింత బలాన్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మెగా ఈవెంట్...