Crime: మేడపై ప్రియుడితో రొమాన్స్.. ముక్కుకోసేసిన భర్త
Crime: ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ కుటుంబ వివాదం తీవ్ర సంచలనానికి దారితీసింది. వివాహం జరిగిన కేవలం ఆరు నెలలకే ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు వెలువడగా, ఆ విషయాన్ని భర్త స్వయంగా గుర్తించడం ఘర్షణకు కారణమైంది. చివరకు ఆవేశం అదుపు తప్పి జరిగిన దాడిలో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రీనా అనే యువతికి ఆరు నెలల క్రితం రాహుల్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం దాంపత్య జీవితం సజావుగా సాగినప్పటికీ, అనంతరం ఆమెకు అత్తవారింటి సమీపంలో నివసించే అజయ్ అనే యువకుడితో సన్నిహిత పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం...