Health Research: యూరిన్ టెస్ట్‌తో చిన్నారుల్లో ఆటిజం గుర్తింపు..!
Health Research: ఆటిజం నిర్ధారణలో విప్లవాత్మక మార్పులకు దారితీసే ఒక కొత్త పరిశోధన వైద్య ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రఖ్యాత ‘మాలిక్యులర్ సైకియాట్రీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, కేవలం ఒక సాధారణ మూత్ర పరీక్ష ద్వారా పిల్లల్లో ఆటిజం లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఆటిజం నిర్ధారణ కోసం పిల్లల ప్రవర్తన, సంభాషణ నైపుణ్యాలు, సామాజిక ప్రతిస్పందనలు, అభివృద్ధి లక్షణాలను పరిశీలించే ప్రక్రియను అనుసరిస్తున్నారు. అయితే ఈ విధానానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణ అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలో సులభమైన మూత్ర పరీక్ష ద్వారా ఆటిజం సంకేతాలను ముందుగానే గుర్తించగలిగితే,...