Viral News: నాకు భార్య లేదు.. ఆటో డ్రైవర్ వింత ప్రచారం..

Viral News: జీవిత భాగస్వామి కోసం ప్రజలు సాధారణంగా మ్యారేజ్ బ్యూరోలు, బంధువుల పరిచయాలు లేదా వివాహ వెబ్‌సైట్లను ఆశ్రయించడం చూస్తుంటాం. అయితే ఓ ఆటో డ్రైవర్ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించి తన పెళ్లి కోసం ఎంచుకున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన జీవిత భాగస్వామిని వెతికేందుకు అతడు చేసిన వినూత్న ప్రయత్నం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఆటోలపై వ్యాపార ప్రకటనలు, సేవలకు సంబంధించిన ప్రచారాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ ఆటో డ్రైవర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రకటనను నేరుగా ఆటోలోనే ప్రదర్శించడం విశేషంగా మారింది. తన ఆటోలో ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేసిన అతడు,...