Switzerland: క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో సరికొత్త విప్లవం!.. రైల్వే ట్రాక్‌ల మధ్య సోలార్ ప్యానెల్స్
Switzerland: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో, స్విట్జర్లాండ్ ఒక వినూత్న ప్రయోగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం భారీ స్థాయిలో భూమిని కేటాయించాల్సి వస్తుంది. అయితే భూమి వినియోగాన్ని తగ్గిస్తూ, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలనే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించాలనే ఆలోచనతో స్విట్జర్లాండ్ రైల్వే పట్టాల మధ్య సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ వినూత్న ఆలోచనను సన్-వేస్ అనే స్విస్ సంస్థ అభివృద్ధి చేయగా, ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్విట్జర్లాండ్‌లోని పశ్చిమ ప్రాంతమైన బుట్టేస్ వద్ద 100 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌పై 48 సోలార్...