Mrigashira Karte: చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

Mrigashira Karte: మృగశిర కార్తె ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతితో పాటు ప్రజల జీవన విధానంలోనూ ప్రత్యేక మార్పులు కనిపిస్తాయి. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ కార్తె ప్రారంభమవుతుంది. వర్షాకాలానికి నాంది పలికే ఈ కాలాన్ని రైతులు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పొలాలను సిద్ధం చేయడం, దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులకు ఇదే శ్రీకారం. అయితే మృగశిర కార్తె అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది చేపలు తినే సంప్రదాయం. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఈ రోజున చేపల వంటకాలతో ఇళ్లన్నీ సందడిగా మారిపోతాయి. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఆరోగ్య,...