El Nino 2026 Effect: ఓవైపు కుండపోత.. మరోవైపు కరువు.. అసలేంటీ పరిస్థితి..?

El Nino 2026 Effect: ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపే సహజ వాతావరణ దృగ్విషయాల్లో ‘ఎల్ నినో’ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలుల దిశల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరోసారి ఎల్ నినో పరిస్థితులపై ఆందోళన పెంచుతున్నాయి. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు కరవు, మరికొన్ని దేశాలు భారీ వర్షాల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే పెరగడం వల్ల ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రభావం కారణంగా వర్షాలను...