Bigg Boss-10 వచ్చేస్తోంది.. స్పెషల్ వీడియో రిలీజ్

Bigg Boss-10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తూ వస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మరో కీలక మైలురాయికి చేరుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా భారీ అంచనాల మధ్య షో ప్రారంభం కానుండగా, తాజాగా విడుదలైన అధికారిక ప్రచార వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున కొనసాగుతున్నట్లు ప్రచార వీడియో ద్వారా స్పష్టమైంది. ప్రత్యేకమైన శైలి, ఆకట్టుకునే వ్యాఖ్యానంతో ప్రేక్షకులను అలరించే నాగార్జున...