Viral Video: తాజ్మహల్లో కోతుల జలకాలాట
Viral Video: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు సాధారణ ప్రజలతో పాటు జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మనుషులే కాకుండా మూగజీవాలు కూడా తమదైన మార్గాలను అన్వేషిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఒక సరదా ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజ్మహల్ ఆవరణలో ఉన్న నీటి ఫౌంటెన్ వద్ద కోతుల గుంపు చేసిన అల్లరి అక్కడికి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కోతులన్నీ కలిసి...