Baby Viral Video: బాబు మిస్సింగ్.. ఆ ప్లేస్‌లో ఏముందంటే..?

Baby Viral Video: అర్ధరాత్రి వేళ జరిగిన ఒక చిన్న సంఘటన ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేయగా, చివరికి అదే ఘటన సోషల్ మీడియాలో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. పసిబిడ్డ కనిపించకుండా పోయిందని భావించిన తల్లిదండ్రులు కొద్ది నిమిషాల పాటు నరకయాతన అనుభవించగా, చివరకు చిన్నారి క్షేమంగా కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఒక కుటుంబం రాత్రి సమయంలో గాఢనిద్రలో ఉంది. తల్లిదండ్రుల మధ్యలో పసిబిడ్డ ప్రశాంతంగా నిద్రిస్తోంది. అయితే అర్ధరాత్రి సమయంలో చిన్నారికి మెలకువ రావడంతో, నెమ్మదిగా మంచం దిగిన ఆ బిడ్డ...