Ram Charan: పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Ram Charan: మెగా హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ క్రీడా నేపథ్య యాక్షన్ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ అంచనాల నడుమ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలతో కూడిన కథ, క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో థియేటర్ల వద్ద సందడి కొనసాగుతోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదవుతుండగా, చిత్రబృందం వరుసగా కలెక్షన్ల వివరాలను పోస్టర్ల రూపంలో ప్రకటిస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజాగా విడుదల చేసిన...