Vastu Tips: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు!
Vastu Tips: చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదని ఆందోళన చెందుతుంటారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు, అప్పులు, ఆర్థిక ఒత్తిళ్లు వెంటాడుతుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని కొన్ని దిశలు, మూలలు సక్రమంగా లేకపోతే ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సులభమైన మార్పులు, ఇంటి మూలల్లో నిర్దిష్ట వస్తువులను ఉంచడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడి, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందవచ్చని వాస్తు శాస్త్రంలో పేర్కొంటారు. ఇంటి ఈశాన్య మూలను అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. ఈ దిశలో దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా...