Telangana: టీ20 లీగ్ వేలంలో స్టార్ ఆటగాళ్ల హవా.. రూ.33 లక్షల రికార్డు ధరకు తిలక్ వర్మ
Telangana: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి ‘తెలంగాణ టీ20 లీగ్’ ఆటగాళ్ల వేలం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో తెలంగాణకు చెందిన స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ క్రికెట్ ప్రతిభకు వేదికగా నిలవనున్న ఈ లీగ్‌లో 8 ఫ్రాంచైజీలు తమ జట్లను నిర్మించుకునేందుకు పోటీపడ్డాయి. ఈ వేలానికి ముందు నుంచే తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్‌లపై భారీ ఆసక్తి నెలకొంది. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. రూ.5 లక్షల కనీస ధరతో...