Scientist Jobs: డీఆర్డీవోలో ఉద్యోగాల జాతర.. రూ.1.23 లక్షల వరకూ జీతం

Scientist Jobs: భారత రక్షణ రంగంలో పనిచేయాలనే లక్ష్యంతో ఉన్న సైన్స్, ఇంజినీరింగ్ నిపుణులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ ద్వారా అనుభవజ్ఞులైన అభ్యర్థుల కోసం ప్రత్యేక నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అడ్వర్టైజ్‌మెంట్ నెం.157 కింద లాటరల్ ఎంట్రీ విధానంలో మొత్తం 33 శాశ్వత సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా సైంటిస్ట్ ‘సి’, సైంటిస్ట్ ‘డి’, సైంటిస్ట్ ‘ఈ’ హోదాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దేశ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే అనుభవజ్ఞులైన నిపుణులకు ఇది అరుదైన అవకాశం. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 33 ఖాళీలలో...