Telangana: పిల్లలు ఎగిరిగంతేసే న్యూస్.. సెలవులు పొడగింపు

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో ప్రారంభం కావాల్సిన పాఠశాలల పునఃప్రారంభంపై తాజా నిర్ణయం తీసుకుంటూ వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, విద్యార్థుల సౌకర్యం, విద్యా నిర్వహణలో సమర్థతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని అమలు చేయనుంది. జూన్ 12న ఒక్కరోజు మాత్రమే తరగతులు నిర్వహించి, వెంటనే వరుసగా రెండు రోజుల సెలవులు రావడం వల్ల విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు భావించారు. జూన్ 13న రెండో శనివారం సెలవు, జూన్ 14న...