Population: భారత్ జననాల రేటుపై ఎలన్ మస్క్ ఆందోళన
Population: భారత్లో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటంపై ప్రపంచ కుబేరుడు, సాంకేతిక దిగ్గజం ఎలన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు జనాభా భవిష్యత్తుపై కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు కీలక స్థాయి కంటే దిగువకు పడిపోయిందని వెల్లడైన గణాంకాలను ప్రస్తావిస్తూ, అత్యంత విద్యావంతులు ఉన్న సమాజాల్లో జననాల రేటు వేగంగా తగ్గుతున్న ధోరణి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కు చేరుకోగా, జనాభా స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది తక్కువగా ఉండటం నిపుణులను...