Schemes: జన్ సమర్థ్ పోర్టల్‌కు 4 ఏళ్లు.. కోట్ల మందికి ఆర్థిక అండ

Schemes: డిజిటల్ యుగంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జన్ సమర్థ్ పోర్టల్’ నాలుగేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని నిన్నటితో పూర్తి చేసుకుంది. 2022 జూన్ 6న ప్రారంభమైన ఈ పోర్టల్, దేశవ్యాప్తంగా రైతులు, చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి కోరుకునే వారికి ఆర్థిక సహాయం అందించే కీలక వేదికగా ఎదిగింది. ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వివిధ ప్రభుత్వ రుణ పథకాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా లక్షలాది మందికి రుణాలు పొందడం సులభతరమైంది. వ్యవసాయం, గృహనిర్మాణం, వ్యాపారం, పునరుత్పాదక ఇంధనం, జీవనోపాధి వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రభుత్వ రుణ పథకాలను ఒకే చోట సమీకరించడం...