Hyderabad: మృగశిర కార్తెకి భాగ్యనగరం ముస్తాబు..!
Hyderabad: ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది ఎదురుచూసే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ఈసారి జూన్ 8, 2026 రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. జూన్ 9 రాత్రి వరకు దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. గత 176 ఏళ్లుగా బతిని హరినాథ్ గౌడ్ కుటుంబం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి చిన్న కొర్రమీను చేప నోట్లో ప్రత్యేక మూలికల మిశ్రమాన్ని ఉంచి మింగిస్తారు. ఇది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుందని...