Federal Court: అమెరికాలో వలసదారులకు గుడ్‌న్యూస్..!

Federal Court: అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందాలని ఆశిస్తున్న వేలాది మంది వలసదారులకు కీలక ఉపశమనం లభించింది. గ్రీన్ కార్డ్‌లు, వర్క్ పర్మిట్‌లు, ఆశ్రయం, పౌరసత్వానికి సంబంధించిన కొన్ని దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తూ గతంలో అమలు చేసిన విధానాలపై అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల ప్రక్రియ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఏర్పడింది. ఫెడరల్ కోర్టు కీలక వ్యాఖ్యలు రోడ్ ఐలాండ్‌లోని ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మెక్‌కానెల్ ఇచ్చిన తీర్పులో, వలస దరఖాస్తులను నిలిపివేసే చర్యలు చట్టపరంగా సమర్థించదగినవి కావని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలకు అనుగుణంగా అన్ని నిబంధనలు...