CM Revanth Reddy: త్వరలో 5 వేల ఉద్యోగాలు.. సీఎం కీలక ప్రకటన
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా పరిపాలనా రంగంలోనూ విస్తృత చర్చకు దారితీశాయి. బెంగళూరులో నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ ఆరో ఎడిషన్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. తెలంగాణలో అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, ఉద్యోగాల భర్తీ, వ్యవసాయం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం: తెలంగాణలో సుపరిపాలన’ అనే అంశంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. హైడ్రా అనే పదం అడాల్ఫ్ హిట్లర్‌కు అత్యంత...