Bank Jobs: డిగ్రీ అర్హతతో 635 పోస్టులు.. ఇవాళ ఒక్కరోజే ఛాన్స్!

Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు ఇది కీలక అవకాశం. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ & సింధ్ బ్యాంక్ భారీ స్థాయిలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 635 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నియామక ప్రక్రియ మంచి అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక జరగనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు...