Hyderabad: లేట్‌గా వస్తోందని రాత్రిపూట కొడుకు ముందే భార్యపై..
Hyderabad: భార్యపై పెంచుకున్న అనుమానం చివరకు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కన్నబిడ్డలు ఎదుటే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "నాన్నా.. అమ్మను చంపొద్దు" అంటూ చిన్నారి వేడుకున్నప్పటికీ కనికరం చూపని భర్త, భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి తేజస్వీనీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరి పిల్లలకు 8, 9 సంవత్సరాల వయస్సు ఉంది....