Deepam Niyamalu: దీపం వెలిగించే నియమాలు తప్పక తెలుసుకోండి..
Deepam Niyamalu: భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఉదయం, సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవన విధానంలో భాగంగా భావించబడుతుంది. దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. అలాగే ఇంట్లో సానుకూల శక్తి పెరగడం, కుటుంబ సభ్యుల్లో ప్రశాంతత నెలకొనడం, శుభకార్యాలకు అనుకూల వాతావరణం ఏర్పడటానికి దీపారాధన దోహదపడుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే దీపం వెలిగించే సమయంలో కొన్ని నియమాలను పాటించడం కూడా అంతే ముఖ్యమని వాస్తు, ఆగమ శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీపాన్ని వెలిగించే సమయంలో దాని దిశపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు...