Interesting Facts: మీకు తెలుసా?.. కోడిగుడ్లను డజన్లలోనే ఎందుకు లెక్కిస్తారో..?

Interesting Facts: ప్రతిరోజూ మనం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. అయితే బియ్యం, పప్పులు, కూరగాయలను కిలోలలో కొనుగోలు చేసే మనం గుడ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం డజన్ అనే లెక్కనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఒక డజన్, రెండు డజన్లు అంటూ గుడ్లను లెక్కించడం ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారిపోయింది. కానీ గుడ్లను ఎందుకు 12 చొప్పున లెక్కిస్తారు? ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు చాలా మందికి తెలియవు. దీని వెనుక చరిత్రతో పాటు గణితశాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన కారణాలు కూడా ఉన్నాయి. చరిత్రకారుల వివరాల ప్రకారం గుడ్లను డజన్లలో విక్రయించే పద్ధతి మొదట ఇంగ్లాండ్‌లో విస్తృతంగా...