Telangana: వేసవి సెలవుల పొడిగింపు..!
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులు ముగిసి జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎండల ప్రభావం కొనసాగుతుండటంతో సెలవుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు తీవ్రమైన ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తర్వాత వెంటనే...