Cambridge University: డిసీజ్ Xకు చెక్ పెట్టే AI సూపర్ వ్యాక్సిన్

Cambridge University: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతగా కుదిపేసిందో ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న ఆ వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు నెలల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు సంభవించినప్పుడు మరింత వేగంగా స్పందించేందుకు వైద్య రంగం సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు సాయంతో అభివృద్ధి చేసిన కొత్త తరహా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో ఉద్భవించే వైరస్‌లను కూడా ముందుగానే అంచనా వేసి రక్షణ కల్పించే సామర్థ్యం కలిగి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ...