Sukka Theeru: యూట్యూబ్లో గత్తరలేపుతున్న సాంగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Sukka Theeru: తెలంగాణ జానపద సంగీతానికి ఇటీవల కాలంలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ వేదికగా విడుదలవుతున్న ప్రైవేట్ జానపద గీతాలు లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గ్రామీణ సంస్కృతి, ప్రేమ, భావోద్వేగాలను ప్రతిబింబించే పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన “చుక్క తీరు” పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విడుదలైన కొద్ది కాలంలోనే కోట్లాది వ్యూస్ సాధించిన ఈ గీతం ప్రస్తుతం డిజిటల్ వేదికలపై అత్యంత వేగంగా దూసుకుపోతున్న పాటల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట తెలంగాణ జానపద సంగీత అభిమానులను...