Viral Video: స్పైడర్ మ్యాన్ కంటే తోపురా భయ్..!
Viral Video: భారతదేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న గ్రామాల నుంచి మహానగరాల వరకు ఎక్కడ చూసినా క్రికెట్ ఆడే యువత కనిపిస్తారు. అయితే అంతటి ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు, వేదికలు లేక ఎంతో మంది యువ క్రీడాకారులు వెలుగులోకి రాకుండానే మిగిలిపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక స్థానిక క్రికెట్ మ్యాచ్ వీడియో మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది. సాధారణ మైదానంలో జరిగిన మ్యాచ్లో ఓ యువ ఫీల్డర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు అతని ఫీల్డింగ్ నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయి...