The Dirty Picture: ప్రతి రాత్రి కన్నీళ్లు తప్పలేదు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది భయ్యా

The Dirty Picture: సినీ పరిశ్రమలో విజయం అందరికీ ఒకే విధంగా దక్కదు. కొందరు మొదటి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకుంటే, మరికొందరు ఎన్నో అవమానాలు, తిరస్కరణలు, నిరాశలను ఎదుర్కొన్న తర్వాతే తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి వస్తుంది. అలాంటి అరుదైన ప్రయాణం చేసిన నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. నేడు బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతమైన నటిగా, వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన ఆమె, కెరీర్ ప్రారంభ రోజుల్లో మాత్రం తీవ్ర నిరాశలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో నిర్మాతలు, దర్శకులు ఆమెను దురదృష్టవంతురాలిగా భావించేవారని, సినిమాల్లో ఆమె ఉంటే ప్రాజెక్టులు నిలిచిపోతాయని కూడా ప్రచారం జరిగేది. దీంతో అవకాశాలు వచ్చినా చేతులారా...