Andhra Pradesh: తల్లికి వందనం డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడంటే..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై స్పష్టత వచ్చింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు, ఫీజులు తదితర ఖర్చుల భారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సాయం ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతుందా అని లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కీలక మంత్రివర్గ సమావేశంలో ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై విస్తృతంగా చర్చ జరిగింది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను ఎప్పుడు జమ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....