Ram Charan: ‘పెద్ది’ ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రమైన ‘పెద్ది’ విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కనబరిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే రూ.110 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. విడుదలకు ముందే భారీ స్థాయిలో ఏర్పడిన ఆసక్తిని ఈ చిత్రం వసూళ్ల రూపంలో మరింత బలంగా ప్రతిబింబించింది. సినీ వాణిజ్య గణాంకాలను విశ్లేషించే ‘సాక్‌నిల్క్’ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశంలోనే ఈ సినిమా రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అభిమానుల...