Farmer Scheme: పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు ఎప్పుడంటే..?
Farmer Scheme: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ అవుతోంది. ప్రతి సంవత్సరం రూ.6,000 చొప్పున మూడు విడతలుగా రైతులకు అందజేస్తుండగా, ఒక్కో విడతలో రూ.2,000 నేరుగా డీబీటీ విధానంలో ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటివరకు 22 విడతల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు 23వ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ ఖాతాలో రూ.2,000 జమ అయ్యాయా లేదా, ఏదైనా సాంకేతిక...