CM Assets: దేశంలో ధనిక ముఖ్యమంత్రులు ఎవరు..? రెండో స్థానంలో తెలుగు సీఎం
CM Assets: దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మరో కారణంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. భారత ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1,413 కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ఆధారంగా దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల కంటే కూడా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉండటం విశేషంగా మారింది. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్...