Hyderabad: భార్య గొంతు కోసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త

Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు చివరకు ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో భర్త తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ రహీం (32)కు సుమేరా బేగం (23)తో 2024లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం 20 నెలల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. వీరు కైత్లాపూర్‌లోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు....