NFHS Survey: ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మంది మహిళలు మద్యం తాగుతారు..?
NFHS Survey: దేశవ్యాప్తంగా మహిళల్లో మద్యం సేవించే వారి శాతానికి సంబంధించిన తాజా వివరాలు జాతీయ కుటుంబ సర్వే (NFHS-6) 2023-24 ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా మద్యం సేవించే మహిళలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. అక్కడ మహిళల్లో 23.2% మంది మద్యం సేవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు సామాజిక, ఆరోగ్య రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళల్లో మద్యం వినియోగం రాష్ట్రాల వారీగా గణనీయమైన తేడాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఈ జాబితాలో సిక్కిం 19.9%తో రెండో స్థానంలో నిలిచింది. అనంతరం తెలంగాణ 7.1%తో మూడో స్థానంలో ఉండగా, త్రిపుర...