Indian Railways Video: అది ఎడ్ల బండి అనుకున్నావా అక్కో..!
Indian Railways Video: భారతీయ రైల్వే స్టేషన్లలో తరచూ ఆసక్తికరమైన ఘటనలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి ఆశ్చర్యానికి గురిచేస్తే, మరికొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. రైలు బోగీలోకి ఒక భారీ పెట్టెను ఎక్కించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు, చివర్లో జరిగిన అనూహ్య పరిణామం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. https://twitter.com/i/status/2061998482244960497 వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రైలు ఆగి ఉండగా ఇద్దరు మహిళలు పెద్ద కార్టన్ పెట్టెను సాధారణ బోగీలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే రైలు తలుపు పరిమాణం చిన్నగా ఉండగా, వారు తీసుకొచ్చిన పెట్టె చాలా పెద్దదిగా...