Viral Video: అదే భారతీయుడు చేస్తే.. కథ వేరేలా ఉండేది..?
Viral Video: హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ధర్మశాలలో ఓ విదేశీ పర్యాటకుడు మద్యం మత్తులో సృష్టించిన హంగామా తీవ్ర కలకలం రేపింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో అతడు చేసిన వీరంగానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్థానిక వ్యాపారులు, బాటసారులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/i/status/2062375732094108071 ధర్మశాలలోని కచేరి చౌక్, కొత్వాలి బజార్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న విదేశీ పర్యాటకుడు రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణాల వద్దకు వెళ్లి అక్కడి సరుకులను లాక్కొని...