Sports: శాంసన్ vs శ్రేయస్.. కౌన్ బనేగా టీ20 కెప్టెన్..?

Sports: భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ ఎంపికపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త నాయకుడిని నియమించే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా ప్రచారంలోకి రావడంతో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవం ఉండటంతో అయ్యర్‌ను భవిష్యత్ నాయకుడిగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంది. కీలక సందర్భాల్లో బాధ్యతాయుతమైన ఆటతీరును కనబరిచిన అతడు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సరైన...