Health News: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం

Health News: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే ప్రత్యేక నిఘా కొనసాగుతున్న సమయంలో, తాజాగా సూడాన్‌కు చెందిన మరో వ్యక్తిలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడం ఆందోళనకు దారితీసింది. అయితే ప్రస్తుతం వైరస్ నిర్ధారణ కాలేదని, తుది పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు వైద్య అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైద్యుల వివరాల ప్రకారం.. సూడాన్‌కు చెందిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్ (36) ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ ప్రక్రియలో అతడిలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలను గుర్తించారు....