Viral Video: నెట్టింట తుఫాన్ సృష్టిస్తున్న నిండు గర్భిణీ ‘చక్రాసనం’!
Viral Video: 39 వారాల గర్భంతో ఉన్న ఓ మహిళ చేసిన యోగా విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్లో ప్రతిరోజూ అనేక వీడియోలు కనిపిస్తున్నప్పటికీ, బెంగళూరుకు చెందిన యోగా శిక్షకురాలు శశి ప్రభా ద్వివేది చేసిన ఈ ప్రదర్శన మాత్రం ప్రత్యేక చర్చకు దారితీసింది. ప్రసవానికి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో, ఆమె ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని కఠినమైన యోగాసనాలను అత్యంత సులభంగా చేస్తూ కనిపించిన వీడియో లక్షలాది మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా గర్భధారణ చివరి దశలో మహిళలు శారీరకంగా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో శశి...