Telangana: సరదా కోసం వెళ్తే సావుకొచ్చింది.. ముగ్గురు మృతి!
Telangana: సరదాగా గడపాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. నదిలో ఈతకు దిగిన ఇద్దరు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ విషాద వార్తతో ఇప్పటికే శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబానికి మరో దారుణం ఎదురైంది. మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బంధువు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందగా, తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వరుసగా చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలు కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానది వద్ద బుధవారం జూన్ 03న ఈ హృదయ విదారక...