Uttarakhand: ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్.. అర్ధరాత్రి పూట..
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ట్రెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యమైన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే కోసం అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించగా, బబితా ఆచూకీ కోసం సైన్యం నుంచి విపత్తు నిర్వహణ బృందాల వరకు అనేక విభాగాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, లోయలు, గుహలు, ట్రెక్కింగ్ మార్గాలను జల్లెడ పట్టినా ఇప్పటివరకు ఆమె జాడ మాత్రం లభించలేదు. నైనిటాల్‌కు చెందిన బబితా పాండే తన ఇద్దరు స్నేహితులు హర్మన్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లతో కలిసి ఉత్తరకాశీ పర్యటనకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మే 25న డెహ్రాడూన్ చేరుకున్న ఈ ముగ్గురు,...