Mulkanoor: రేపు శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

Mulkanoo: భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో వెలసిన శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం పూర్తై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 05 జూన్ 2026న ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులందరినీ ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి అనుగ్రహం పొందాలని కోరింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామివారికి విశేష పూజలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించబడతాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు....