రుతుపవనాల వేగం పెరిగింది పలు రాష్ట్రాలకు వర్ష సూచన
దేశవ్యాప్తంగా భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో భారత వాతావరణ శాఖ ఆశాజనకమైన సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అనుకూల పరిస్థితుల మధ్య వేగంగా ముందుకు కదులుతున్నాయని, జూన్ 4 ప్రాంతంలో కేరళ తీరాన్ని తాకే అవకాశముందని తెలిపింది. రుతుపవనాల ప్రవేశంతో దేశంలో అధికారికంగా వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈసారి రుతుపవనాల కదలికకు అరేబియా సముద్రం మీదుగా వీచుతున్న తేమగాలులు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. వీటి ప్రభావంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళలో కొన్ని ప్రాంతాల్లో...